త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనన్య.. ఆ ట్యాగ్‌ను ఆల్రెడీ వేసేసుకుంది కూడా..

by sudharani |
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనన్య.. ఆ ట్యాగ్‌ను ఆల్రెడీ వేసేసుకుంది కూడా..
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అనన్యా పాండే సినిమాలతో కన్నా ప్రేమాయణంతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌ను ప్రేమిస్తుందని.. ఇద్దరు కలిసి పలు వెకేషన్స్‌కు కూడా వెళ్లారన్న రూమర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట హల్ చల్ చేశాయి. ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ ఇండైరెక్ట్‌గా లవ్‌లో ఉన్నట్లు హింట్ ఇచ్చేసింది. ఇక తాజాగా ఈ భామ.. బాయ్ ఫ్రెండ్‌ కపూర్ ఫ్యామిలీకి చెందిన వాడు కావడంతో ఆ ట్యాగ్‌ను డ్రెస్‌పై ధరించి కనిపించింది.

పింక్ కలర్ డ్రెస్‌ వేసుకున్న అనన్య.. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబోలో ఉన్న కపూర్‌ ట్యాగ్‌తో ఓపెన్‌గా తిరగడం అందిరినీ ఆశ్చర్యపరుస్తుంది. మొత్తానికి ఈ ప్రేమికులు ఇద్దరు పెళ్లిపీటలెక్కే చాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. కాగా రీసెంట్‌గా ‘డ్రీమ్ గర్ల్ 2’తో హిట్ అందుకున్న అనన్య.. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఇక ఆదిత్య విషయానికి వస్తే ‘ది నైట్ మేనేజర్’ సిరీస్‌తో ఓటీటీలో అలరించిన ఆయన.. ఈ మధ్య అనన్యతో వెకేషన్స్ ఎంజాయ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed