రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్

by sudharani |
రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. చర్రీ, ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డి కలిసి ‘V MegaPictures’ అనే బ్యానర్‌ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘V MegaPictures’ నుంచి ఈరోజు మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్‌లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించనుండగా కొత్త డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో నిఖిల్ హరోగా ‘ది ఇండియా హౌస్’ సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. కాగా ఇందులో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు.

Next Story