- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
నీ భర్తకు మన సీక్రెట్ చెప్పాలా వద్దా?.. హీరోయిన్‌తో షారుఖ్ కన్వర్జేషన్ వైరల్

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన మొదటి హీరోయిన్ రేణుకా షహానే మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ మేరకు ఆదివారం రేణుక తన భర్త, నటుడు అశుతోష్ రానాతో కలసి 'పఠాన్' చూడటానికి వెళ్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఫైనల్లీ గోయింగ్ టూ వాచ్ #పఠాన్. వాతావరణం కూడా బాగుంది. కుర్చీ సీట్ బెల్ట్‌లను నడుముకు బిగించాను. లూత్రా జీతో కలిసి చూడబోతున్నా' అంటూ రాసుకొచ్చింది. కాగా ఆమె పోస్ట్‌పై స్పందించిన షారుఖ్.. 'నువ్వు నా మొదటి హీరోయిన్ అని కల్నల్ లూత్రాతో చెప్పావా? లేదా మనం దానిని రహస్యంగా ఉంచాలా? లేదంటే అతను నన్ను ఏజెన్సీ నుంచి తొలగించవచ్చు' అని పఠాన్‌లో అశుతోష్ క్యారెక్టర్‌ను ఉద్దేశిస్తూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. మళ్లీ వెంటనే రిప్లయ్ ఇచ్చిన రేణుక.. 'హహహ.. అతనికి తెలియకుండా ఏదైనా దాచగలరా? మీరు అతనిని అన్నీ తెలిసిన వ్యక్తిగానే భావిస్తారు. కానీ, ఏం జరిగినా తను మిమ్మల్ని తొలగించలేడు. ఎందుకంటే మీరు చేసే పని ఎవరూ చేయలేరు' అంటూ షారుఖ్‌ను పొగిడేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.