కళ్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి అదిరి పోయే అప్డేట్..! బ్లాక్ బస్టర్ పంచ్..

by Kavitha |
కళ్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి అదిరి పోయే అప్డేట్..! బ్లాక్ బస్టర్ పంచ్..
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల బింబిసార, డెవిల్ సినిమాలతో మంచి విజయాలు సాధించిన కళ్యాణ్ రామ్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. గత సంవత్సరం దసరా సమయంలో కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా కూడా అనౌన్స్ చేశారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ కీరోల్ పాత్రలో విజయశాంతి నటిస్తుంది.

అయితే తాజాగా నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్ధంతి సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసి షూట్ శరవేగంగా జరుగుతుందని ప్రకటించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. దీంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ పంచ్ కొడతామని పోస్ట్ చేశారు మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

Next Story