ముంబై స్ట్రీట్ గోడలపై ఆర్ట్స్ వేసుకుంటున్నా అమితాబ్ బచ్చన్ మనవరాలు

by Disha Web |
ముంబై స్ట్రీట్ గోడలపై ఆర్ట్స్ వేసుకుంటున్నా అమితాబ్ బచ్చన్ మనవరాలు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్వ నవేలి ముంబై స్ట్రీట్ గోడలపై పెయింటింగ్ వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అయితే ఇలా ఎందుకు చేసిందంటే.. ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని పిరియడ్స్‌పై కుడ్యచిత్రాలు గోడలపై గీసి అవగాహన కల్పిస్తోంది. దీనిపై అన్ని ప్లాట్‌ఫామ్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్‌లో తన బృందంతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీనికి "ఇది రుతుక్రమాన్ని జరుపుకోవడానికి, బహిరంగ ప్రదేశాలను మరింత స్నేహపూర్వకంగా చేయడానికి మా ప్రయత్నం." అని రాసుకొచ్చింది.

Next Story