18 ఏళ్లకే ఒత్తిడి ఎదుర్కొన్నా.. సీనియర్ హీరోలతో!

by Hamsa |
18 ఏళ్లకే ఒత్తిడి ఎదుర్కొన్నా.. సీనియర్ హీరోలతో!
X

దిశ, సినిమా : అందాల బ్యూటీ అమలాపాల్ తన కెరీర్ ఒడిదొడుకుల గురించి ఓపెన్ అయింది. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎమోషనల్ అయింది. ఈ మేరకు మొదటి నుంచి విభిన్నమైన పాత్రలకే మొగ్గుచూపుతున్నానన్న ఆమె.. ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయోగాలు చేయక తప్పలేదని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో వయసు గురించి ఎవరు పట్టించుకోరని, తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడే సీనియర్ హీరోలతో నటించానని తెలిపింది.

అలాంటి టైమ్‌లో సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఒత్తిడికి గురైన.. వారితో పనిచేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే వెసులుబాటు కలిగిందని వివరించింది. ఇక తనకు గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవడంతో.. తప్పుల నుంచే నేర్చుకుని రిపీట్ కాకుండా చూసుకున్నట్లు చెప్పింది. ఇక తనకు తానుగా యంగర్ అమలాపాల్‌కు సలహా ఇవ్వాలనుకుంటే.. ఎక్కువ కష్టపడకు అని చెప్తానని తెలిపింది.

శాడిస్ట్ భర్త కావాలంటున్న స్టార్ హీరోయిన్..

Next Story