తొలిసారి కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్..

by Prasanna |
తొలిసారి కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఫహద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. పెళ్ళైన కొన్ని నెలలకే గర్భం దాల్చిన ఆమెకు అబ్బాయి పుట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా మదర్స్ డే సందర్భంగా త‌న త‌నయుడిని మీడియాకి ప‌రిచ‌యం చేసింది. కొడుకు, భర్తతో కలిసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ది ప్రిన్స్’ అంటూ కొడుకును ఇంట్రడ్యూజ్ చేసింది. దీంతో అభిమానులు.. ‘చాలా క్యూట్‌గా ఉన్నాడు. అమ్మ పోలికే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More: మదర్స్ డే సందర్భంగా పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకొన్న హీరోయిన్

Next Story