- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ స్టార్ హీరో మూవీ చూసి మాజీ లవర్ ఇంటికెళ్లిన అల్లు హీరో…

దిశ, సినిమా: కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మంచి పేరు దక్కించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్. ఒక్క క్షణం, గౌరవం, కొత్త జంట, ఏబీసీడీ, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వసివో రాక్షసివో వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ అన్న బన్నీ అంతా క్రేజ్ మాత్రం రావట్లేదు. ప్రస్తుతం అల్లు శిరీష్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ కూడా లేదు.
ఇకపోతే తాజాగా ఈ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. హీరో సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ అనే సినిమాలో సూర్య హీరోయిన్ ఇంటికి వెళ్తాడు కదా. దీంతో హీరోయిన్ ఇంప్రెస్ అయి హీరోను ప్రేమిస్తుంది. ఈ సినిమాలోని సన్నివేశాన్ని ఫాలో అయి అల్లు శిరీష్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బోర్లా పడ్డాడట.
శిరీష్ ప్రియురాలు గొడవపెట్టుకుని ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడంతో కోపంలో మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ తన ఇంటికి వెళ్లాడట. తీరా హీరోయిన్ ఇంటికెళ్లేసరికి వారి పేరెంట్స్ ఉన్నారట. ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే ఇంటికొస్తారా? అంటూ క్లాస్ పికారట. దీంతో శిరీష్ గర్ల్ ఫ్రెండ్ అప్పటి నుంచి మాట్లాడటం మానేసిందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.