తారక్ పై అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్..!

by sudharani |
తారక్ పై అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆయనను ఇష్టపడనివారంటూ ఉండరు. తారక్ కూడా తన ఫ్యాన్స్ తోపాటు తోటి యాక్టర్స్ తో ఎంతో ప్రేమగా ఉంటాడు. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరితో NTRకి స్పెషల్ బాండింగ్ ఉంది. అయితే ఈ మధ్య మెగాస్టార్ ఇంట్లో దీపావళి పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ సెలబ్రేషన్స్ కి నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు. మెగా ఇంట జరిగిన ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేసింది. అయితే ఇందులో భాగంగా అల్లు శిరీష్, ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..‘ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎవరు ఎప్పుడు ..తనతో ఓ ఫోటో అడిగినా.. తారక్ అన్నా ఎంత బిజీగా ఉన్నా.. అందరితో ఒకేలా ఉంటాడు. వారికి ప్రేమతో ఒక ఫొటో ఇస్తాడు. ఆయన మనసు చాలా మంచిది’ అంటూ చెప్పుకొచ్చాడు.Next Story

Most Viewed