ప్రభాస్ దెబ్బకు భయపడ్డ అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్‌ రిజెక్ట్..!

by sudharani |
Allu Arjun Invited for Grand marshal India Today Parade as chief Guest
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ దక్కించుకున్న అల్లు.. ఇప్పుడు ‘పుష్ప-2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో మూవీస్ చెయ్యనున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారట అల్లు అర్జున్. విషయం ఏంటంటే..

బాహుబలి అనంతరం ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ సినిమా చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అనుకుంత ఆదరణ పొందలేక పోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే.. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్‌తో చేసి డిజాస్టర్‌గా నిలిచాడని అల్లు అర్జున్ బయపడినట్లు ఫిలిమ్‌ వర్గాల్లో టాక్. ఈ క్రమంలోనే బన్నీతో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తే నో చెప్పినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. మన హీరోలు బాలీవుడ్ డైరెక్టర్లకు భయపడుతున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Read More..

పవన్ కల్యాణ్ రిజెక్ట్ చేసిన స్టోరీని ఓకే చేసిన మెగాస్టార్..!

పాలిటిక్స్‌లోకి బన్నీ.. బీఆర్ఎస్ తరపున బరిలోకి..

Next Story

Most Viewed