Allu Arjun: గుర్తు తెలియని వ్యక్తి నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-09-15 15:01:36.0  )
Allu Arjun: గుర్తు తెలియని వ్యక్తి నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. పుష్ప-2 డిసెంబర్ నెలలో థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. అయితే అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా, అల్లు అర్జున్‌కు గుర్తు తెలియని వ్యక్తి గిఫ్ట్ పంపడంతో ఆయన ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘గుర్తు తెలియని వ్యక్తి నాకు ఓ పుస్తకాన్ని పంపించాడు. అతని నిజాయితీ, నాపై చూపించిన చొరవతో మనసు నిండింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు అది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్’’ అని పోస్ట్ పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read More..

కార్తీ కొత్త ప్రాజెక్ట్‌ షురూ.. ఆసక్తికరంగా పోస్టర్

Advertisement

Next Story