క్లింకార బర్త్‌డే సెలబ్రేషన్స్.. బయటపడ్డ అసలు నిజాలు!

by sudharani |
క్లింకార బర్త్‌డే సెలబ్రేషన్స్.. బయటపడ్డ అసలు నిజాలు!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన.. దాదాపు పెళ్లై పదేళ్లు దాటిన తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక వారసురాలు రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతేకాకుండా మెగా వారసురాలు క్లింకార రాకతో.. నాన్న రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చకున్నాడు. తాత చిరంజీవికి పద్మ విభూషన్ అవార్డు వచ్చింది. చిన్నాన పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాడు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక క్లింకార పుట్టి సంవత్సరం కావడంతో.. తాజాగా పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. దీంతో ఇప్పుడు నెట్టింట కొత్త చర్చ మొదలైంది.

అయితే.. 10 ఏళ్ల నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎలక్షన్లో మెగా ఫ్యామిలీతో సహా.. పలువురు స్టార్ హీరోలు, ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన సపోర్ట్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి తెలిపాడు. అతడి తరఫున ప్రచారానికి వెళ్లాడు. దీంతో నెట్టింట మెగా Vs అల్లు ఫ్యామిలీస్ అన్నట్లుగా వార్ నడుస్తుంది. దీనికి తోడు.. ఎలక్షన్ల టైంలో నాగబాబు ట్వీట్, సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో కొట్టడం అన్నీ ఈ గొడవలకు ఆద్యం పోశాయి. ఇప్పుడు క్లింకార బర్త్‌డేతో ఇవి మరింత హాట్ టాపిక్‌గా మారాయి.

జూన్ 20న క్లింకారా ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. ఈ క్రమంలోనే క్లింకార బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోస్‌లో ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు కనిపించలేదు. మెగా వారసురాలు క్లింకార పుట్టినరోజు వేడుకలకు అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరుకాకపోవడం అందరిని షాక్‌కు గురిచేస్తుంది. దీంతో.. మొన్నటి వరకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఏమో అనుకున్నాం.. కానీ బర్త్‌డే వేడుకలతో కన్ఫర్మ్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక మరికొందరు మాత్రం అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీ వచ్చిందో లేదో తెలియకుండా ఈ ట్రోల్స్ అవసరమా అంటూ రిప్లైలు ఇస్తున్నారు.Next Story

Most Viewed