‘వరుడు’ నటికి ఊహించని షాకిచ్చిన బన్నీ.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
‘వరుడు’ నటికి ఊహించని షాకిచ్చిన బన్నీ.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ప్రముఖ యంగ్ బ్యూటీ భానుశ్రీ మెహ్రాకు నటుడు అల్లు అర్జున్ ఊహించని షాకిచ్చాడు. ‘వరుడు’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా ఆ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడలేకపోయింది. దీంతో మూవీ ఛాన్సులు లేక కొంతకాలం గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమైన భాను శ్రీ.. తర్వాత 2018లో కరణ్ అనే ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లాడింది. ఇదిలావుంటే.. భానుశ్రీ మెహ్రాను ట్విట్టర్‌లో అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు. కాగా ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్న నటి.. బన్నీ బ్లాక్ చేసిన ఓ స్క్రీన్ షాట్‌ను సైతం పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ పోస్ట్‌కు ‘మీరు ఎప్పుడైనా ఒక గాడిలో కూరుకుపోయినట్లు భావిస్తే.. నేను అల్లు అర్జున్‌తో ‘వరుడు’లో నటించిన తర్వాత ఇప్పటికీ ఏ పని చేయలేకపోయాను అని గుర్తుతెచ్చుకోండి. కానీ, ఎంతటి కష్ట సమయంలోనైనా నేను హాస్యాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ చేశారు. గో సబ్‌‌స్క్రయిబ్?’ అని భిన్నమైన క్యాప్షన్ రాసుకొచ్చింది.


Next Story

Most Viewed