నెపోటిజంపై Allu Aravind సంచలన వ్యాఖ్యలు..

by Disha Web Desk 7 |
నెపోటిజంపై Allu Aravind సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం. నెపోటిజం కారణంగా నష్టపోయాం అనే వాదనలు కూడా చాలా ఉన్నాయి. బాలివుడ్ పెద్దలకు, నెపోకిడ్స్‌కి వ్యతిరేకంగా ఓ వర్గం సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్న విషయం కూడా తెలిసింది. తాజాగా నెపోటిజంపై అల్లు అరవింద్ స్పందించారు.. బాలయ్యబాబు అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌లుగా నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు వచ్చారు. వారిని బాలయ్య నెపోటిజంపై తమ అభిప్రాయం చెప్పమనగా.. అల్లు అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నెపోటిజం అని విమర్శించే వారు.. వాళ్ల గుండెల మీద చేయి వేసుకుని ఒక విషయం చెప్పాలి. వాళ్లకు కూడా ఇలాంటి అవకాశం వస్తే వినియోగించుకుంటారా..? లేక ఇది నెపోటిజం అని పక్కకు పెట్టేస్తారా అని ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణంలోనే పిల్లలు పెరుగుతారు. తండ్రి బాటలో నడవాలి అనుకుంటారు. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. ప్రతి రంగంలోనూ ఉంటుంది. తన తండ్రి లాయర్, డాక్టర్, ఇంజనీర్, బిజినెస్ మాన్ అనుకుంటే వారి వారసులు కూడా అదే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంటే అన్ని రంగాల్లో నెపోటిజం ఉన్నట్లేనా అంటూ సీరియస్‌గా స్పందించారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. నెపోటిజం అనేది కేవలం ఆరంభం మాత్రమే ఇస్తుంది. వారు స్టార్‌గా ఎదగాలంటే అది టాలెంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. కేవలం వారసత్వం వలనే ఎదగరు అంటూ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed