చిరంజీవిపై విషం కక్కుతున్న అల్లు అరవింద్.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 7 |
చిరంజీవిపై విషం కక్కుతున్న అల్లు అరవింద్.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: ఈ మధ్య చిరంజీవికి, అల్లు అరవింద్‌కు అస్సలు పడటం లేదని చాలా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొన్న వరుణ్ పెళ్లిలో కూడా అల్లు ఫ్యామిలీ నుంచి అందరు వచ్చినప్పటికీ.. అల్లు అరవింద్ మాత్రం రాలేదు. అంతేకాదు చిరుకు ఎవరైతే అగెనెస్ట్‌గా ఉన్నారో వారితోనే ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని గమనించిన మెగా అభిమానులు చిరు విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.

ఇక బాలకృష్ణతో చిరంజీవికి ఎలాంటి గొడవలు లేవు కానీ సినిమాల పరంగా వారి మధ్య కొంత మనస్పర్థలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా ఇప్పడు బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ షో చేయిస్తున్నాడు అల్లు అరవింద్. దీంతోపాటుగా ప్రస్తుతం మోహన్ బాబుతో కూడా బిజినెస్‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇలా చిరంజీవి అంటే గిట్టని వాళ్లందరితో గుడ్ ఫ్రెండ్‌ షిప్ మెయింటెన్ చేసే పనిలో ఉన్నాడట. దీంతో ఆయన ఎందుకు మెగాస్టార్‌పై ఇలా విషం కక్కుతున్నాడనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయాలన్నీ తెలిసినా చిరు మాత్రం పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుపోతున్నట్లు సమాచారం.

Next Story