ఆ తప్పంతా నాదే అంటున్న అక్షయ్ కుమార్..

by Seetharam |
ఆ తప్పంతా నాదే అంటున్న అక్షయ్ కుమార్..
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి బొద్దిగా అదృష్టం కలిసి రావడం లేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రాలు సైతం చివరికి నిరాశ ఎదుర్కోక తప్పట్లేదు. దీనికి తోడు ప్రతి సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఓ వర్గం అదే పనిలో ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆయన నటిస్తోన్న సరికొత్త చిత్రం 'కట్‌పత్లీ'. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న 'రాచ్చసన్‌' రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న సినిమా నేరుగా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజవుతోంది.

కాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హిందీ చిత్రాలన్నీ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచి అన్ని మూవీస్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తారా?' అన్న ప్రశ్నపై స్పందించిన అక్షయ్.. 'థియేటర్లలో సినిమాలు ఆడటం లేదంటే అది ప్రేక్షకులకు నచ్చలేదు అని అర్థం. థియేటర్‌లకు ప్రేక్షకులు రావడం లేదని, వారిని నిందించడానికి వీల్లేదు. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మేము కూడా మారి, వారికి నచ్చేలా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది' అని అభిప్రాయపడ్డాడు.

Next Story

Most Viewed