అకీరా క్రేజ్ మాములుగా లేదుగా.. పవన్ ‘తమ్ముడు’ రీ రిలీజ్‌లో కొడుకు సందడి.. వీడియో వైరల్

by sudharani |
అకీరా క్రేజ్ మాములుగా లేదుగా.. పవన్ ‘తమ్ముడు’ రీ రిలీజ్‌లో కొడుకు సందడి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో.. సినీ ఇండస్ట్రీలో ఆయన స్థానాన్ని వారసుడు అకీరా నందన్ భర్తి చేయాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. అంతే కాకుండా.. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. కానీ మొన్నటి వరకు అకీరా సోషల్ మీడియాలో కనిపించడమే గగనమైంది. కానీ ఇప్పుడు మాత్రం వీరలెవల్ క్రేజ్‌తో సందడి చేస్తున్నాడు అకీరా.

తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ప్రధాని మేడిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లాడు. అప్పుడు తన వెంట కొడుకు అకీరాను కూడా తీసుకెళ్లాడు పవన్ కల్యాణ్. అప్పటి నుంచి అకీరా నేమ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఎక్కడ చూసిన, విన్నా అకీరానే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ విజయం సాధించిన ‘తమ్ముడు’ రీరిలీజ్ చేశారు. హైదరాబాద్ దేవి థియేటర్‌లో ఈ సినిమా రీ రిలీజ్ అవ్వగా.. అకిరా హాజరయ్యాడు. ఇక అకిరా రాకతో థియేటర్‌లో అభిమానుల కోలాహలం కనిపించింది. అకీరాని చూసేందుకు, ఫొటోస్ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే లేట్.. ఏంటీ ఆ క్రేజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.Next Story

Most Viewed