పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఎదగడం సవాలే: Aishwarya Rai Bachchan

by Disha Web Desk 6 |
పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఎదగడం సవాలే: Aishwarya Rai Bachchan
X

దిశ, సినిమా: అందాల తార ఐశ్వర్యా రాయ్ సమాజంలో మహిళలు బలమైన శక్తిగా ఎలా ఎదగాలనే విషయంపై విలువైన సలహాలు ఇచ్చింది. ముఖ్యంగా పురుషాధిక్యత కలిగివున్న సొసైటీలో స్త్రీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచించింది. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మగాళ్లు పెత్తనం చెలాయిస్తున్న ఈ ప్రపంచంలో ఒక స్త్రీ ఉన్నతమైన పేరు పొందడాన్ని సవాలుగా పేర్కొంది. 'ఆడవాళ్లంతా ఒకరితో ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండటం చాలా ముఖ్యం.

లింగ వివక్షతను డామినేట్ చేయాలంటే అందరితో సౌకర్యవంతంగా, నిజాయితీగా ఉండాలి. వ్యక్తిగత ఎంపికలు ఏమైనప్పటికీ పనిపట్ల బలమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ 'నో' అనే పదాన్ని నమ్మకుండా 'ఎస్' అనే పాజిటీవ్ ఆలోచనలతో ప్రయాణించండి. ఈ జర్నీలో ప్రతీక్షణాన్ని ఆస్వాదించండి. నిరంతరం వర్తమానంలో ఉండండి. హడావిడిలో పిచ్చిగా వ్యవహరించొద్దు. సమయం మనకోసం ఆగదు. జీవితం వేగంగా పరుగెడుతోంది' అంటూ వివరించింది.

Also Read : అమ్మాయిల సొంత గుర్తింపు తొక్కేస్తున్న అబ్బాయిలు: ఆశా నేగి


Also Read : స్త్రీ పురుష సమానత్వం.. సాధ్యమేనా?

Next Story

Most Viewed