నటి సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి.. మౌనం వీడిన కుటుంబ సభ్యులు

by sudharani |
నటి సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి.. మౌనం వీడిన కుటుంబ సభ్యులు
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి నూర్ మాళబిక దాస్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబై‌ లోఖండ్వాలాలోని తన ఫ్లాట్‌లో సూసైడ్‌కు పాల్పడిన నూర్ మృతదేహాన్ని కుళ్లి పోయిన స్థితిలో గుర్తించారు పోలీసులు. ఆమె ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో.. అనుమానంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న వారు.. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో చూసి ఆత్యహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. అయితే.. తాజాగా ఈ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నూర్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆమె మరణంపై పలు కామెంట్స్ చేశారు.

ఈ మేరకు నూర్ మాళబిక అత్త మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నో అంచనాలతో పెద్ద నటిగా పేరు తెచ్చుకోవాలని ముంబైకి వచ్చింది. అంతే కాకుండా ఓ నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆమె ఎంతో కష్టపడింది. కానీ తన విజయాలతో ఆమె సంతోషంగా లేదని.. ఆ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. నూర్ మాళబిక ‘సిస్కియాన్, వాక్ మ్యాన్, టిఖి చట్నీ, జగహన్య ఉపాయ, చర్మ్ సుఖ్, దేశి అందేఖి, బ్యాక్ రోడ్ హస్టిల్’ మొదలైన చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా ఆమె మరణానికి ముందు గుండు కూడా కొట్టించుకుని.. దాని మీద జిమ్ వీడియో చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed