రజనీకాంత్‌తో అనవసరంగా నటించా.. హీరోయిన్ మమతా మోహన్ దాస్ సంచలన కామెంట్స్!

by Kavitha |
రజనీకాంత్‌తో అనవసరంగా నటించా.. హీరోయిన్ మమతా మోహన్ దాస్ సంచలన కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి మమత మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరియర్ బిగినింగ్‌లోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుండగానే అనుకోకుండా క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత టాలీవుడ్ ను వదిలి కేవలం తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విశాల్‌తో ‘శిలపతికారం సినిమాలో, విజయ్ సేతుపతితో మహారాజా సినిమాలో నటించింది మమతా మోహన్ దాస్.

అయితే మహారాజా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్లొన్న ఈ బ్యూటీ రజనీకాంత్ సినిమా కుసేలన్ పై హాట్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుసేలన్‌ మూవీలో ఓ పాట కోసం రజనీతో ఒప్పందం కుదుర్చుకుని 2 రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లి కష్టపడి సాంగ్ చేసాను. అయితే ఆ సినిమాలో నేను చేసిన పార్ట్ మొత్తం డిలీట్ అయింది. కేవలం ఆ పాటలో ఒక్క సెకను మాత్రమే కనిపిస్తానని.. అది చూసిన నాకు అసలు కుసేలన్ సినిమాలో ఎందుకు నటించానో అనిపించిందని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపై ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed