ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కోసమే.. కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ

by Disha Web Desk 7 |
ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కోసమే.. కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ
X

దిశ, సినిమా : ఇండియన్ యంగ్ బిజినెస్ కమర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఇండియా లెవెల్‌లో ఓటీటి కంటెంట్‌ను ప్రజెంట్ చేయడమే లక్ష్యంగా కమర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, దాని ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే సినిమాలో నటించే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో తన వ్యాపారాన్ని భారతదేశం మొత్తం విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 24న హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో కమర్ ఫిలిం ఫ్యాక్టరీని మీడియా, పత్రికా విలేకరుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాక్స్ క్రికెట్ లీగ్ ప్రొప్రైటర్, కమ్మర్ ఫిలిం ఫ్యాక్టరీ అధినేత కమర్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ విలువలతో మంచి సినిమా కంటెంట్లను ప్రోత్సహించడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నిర్మాణంలో జరిగే సినిమాలను ఓటిటి ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పారు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మళియాలంలో సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని తన కోరికను బయటపెట్టారు.


Next Story

Most Viewed