ఆ హీరో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు.. రాష్ట్రంలోకి రానివ్వొద్దన్న సీఎం

by Disha Web Desk 6 |
ఆ హీరో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు.. రాష్ట్రంలోకి రానివ్వొద్దన్న సీఎం
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. మిస్టర్ పర్‌ఫెక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తర్వాతే అమీర్‌ తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలని కోరారు. ఇటీవలే మీడియా సమక్షంలో మాట్లాడిన సీఎం.. 'అమీర్ ఖాన్ తన సినిమా ప్రమోట్ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడాలనుకున్నారు. కానీ ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం.

ఇలాంటి సమయంలో మా ఫోకస్‌ పక్కదారి పట్టకూదని భావిస్తున్నాం. అందుకే తన పర్యటనను వాయిదా వేసుకుని, స్వాతంత్య్ర దినోత్సవానంతరం అస్సాంలో పర్యటించాలని అమీర్‌ను కోరుతున్నాం. ఆయనతో ఫోన్‌లో తరచుగా మాట్లాడుతుంటాను. నేను ఆహ్వానించినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాడు' అని హిమంత వివరించారు. కాగా అమీర్‌.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు.


Next Story

Most Viewed