ప్రేక్షకుల సపోర్ట్‌తోనే ఎదిగామన్న యంగ్ హీరో

by Disha Web Desk 10 |
ప్రేక్షకుల సపోర్ట్‌తోనే ఎదిగామన్న యంగ్ హీరో
X

దిశ, సినిమా: ఫ్రెండ్, సహ నటుడు విజయ్ దేవరకొండతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. సినీ కెరీర్ ప్రారంభంలో, ఆ తర్వాత హీరోగా ఎదుగుతున్న క్రమంలోనూ తామిద్దరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు కడుపు నిండ భోజనం కూడా దొరికేదికాదని, చేతిలో డబ్బుల్లేక అవస్థలు పడ్డామని చెప్పాడు. ‘‘ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో నేను, విజయ్ చిన్న రోల్స్ చేశాం. ఆ పాత్రల కోసం ఇద్దరం కలిసి ఆడిషన్‌కు వెళ్లినపుడు మాకు ఇచ్చిన పాత్రల విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యాం. అక్కడి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రేక్షకుల ఆదరణే కారణం. ఇప్పటికీ మేము ఇద్దరం టచ్‌లోనే ఉంటాం’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చాడు. చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తనను ఎంతో బాధపెట్టిందని, ఆ ఘటన నుంచి కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందని గుర్తుచేసుకున్నాడు నవీన్.

Next Story

Most Viewed