అవకాశాల కోసం లొంగిపోక తప్పదు.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి బోల్డ్ కామెంట్స్

by Kavitha |
అవకాశాల కోసం లొంగిపోక తప్పదు.. క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో తెలుగు తో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇక చాలా మంది నటినటులు దీని ఫేస్ చేసి ఉంటారు. కొందరు బయటకు చెప్పుకుంటారు మరి కొందరు చెప్పుకోరు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం, పలు ఇంటర్వ్యూలలో భాగంగా కొంత మంది నటిమనులు వారికి ఎదురైన చేదు అనుభవాలను నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటి సత్య కృష్ణన్ కూడా నోరు విప్పింది.

సత్య గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఎక్కువగా హీరోలకు అక్క, వదిన, పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య .. తన కెరీర్, వ్యక్తిగత విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా నటి మాట్లాడుతూ ‘మా అమ్మానాన్న ఇద్దరు బ్యాంకు ఉద్యోగులే. నేను పుట్టి పెరిగిందంతా హైద‌రాబాద్‌ లోనే. నాన్న చనిపోయాక మా స్నేహితులు, నాన్న ఫ్రెండ్స్‌ ఎంతో స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డారు. ఆర్థికంగా కూడా సాయం చేశారు. ఇక సినిమాల్లోకి అనుకోకుండా వ‌చ్చాను. నాకు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు.

ఇక ఇన్నేళ్ల నా సిని కెరీర్‌లో న‌న్ను ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. అలా అని ఇండ‌స్ట్రీ లో చెడు లేదు అని కాదు. ఎందుకంటే ప‌ని చేసేట‌ప్పుడు ఎవ‌రైనా ఏమైనా అంటే అవి ప‌ట్టించుకోవ‌ద్దు. ఇలాంటివి స‌ర్వసాధార‌ణం. కానీ క్యాస్టింగ్ కౌచ్ విష‌యానికి వ‌స్తే ఇది ప్రతిచోటా ఉంది. స‌ముద్రంలో నీటితో పాటు ఉప్పు కూడా ఉంటుంది. ఇండస్ట్రీ విషయంలో ఇది అలాగే.. నాకైతే అలాంటి అనుభ‌వం ఎదుర‌వ‌లేదు. ప్రపంచంలో ఎక్కువ‌ అందంగా ఉండేది అమ్మాయిలే క‌దా, అందుకే ఆడ‌వాళ్లే ఇలాంటి స‌మ‌స్యలు ఎక్కువ‌ ఎదుర్కొంటున్నారు. మ‌నం ఎలా ఉన్నాం, మ‌న‌ల్ని మ‌నం ఎలా కాపాడుకున్నామ‌నేదే ముఖ్యం. కానీ పాత్రలు ఇవ్వరేమో అని కెరీర్ గురించి భ‌య‌పడటం కరెక్ట్ కాదు. ఇక ఇది త‌ప్ప ఇంకో ఛాన్స్ లేద‌నుకునేవాళ్లు అలాంటి వారికి లొంగిపోతారు. కానీ అది వారికి నరకంగా ఉంటుంది.’ అంటూ చెప్పుకొచ్చింది సత్య.

Next Story

Most Viewed