పెళ్లెప్పుడు అని అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా ఏమన్నదంటే?

by Hamsa |
పెళ్లెప్పుడు అని అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన జబర్దస్త్ ఫైమా ఏమన్నదంటే?
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ ఫైమా కూడా ఒకరు. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయినప్పటికీ జబర్దస్త్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొంది. తన ఆటతీరుతో అందరినీ మైమరిపించింది. కానీ విన్నర్ కాలేకపోయింది. ముఖ్యంగా సూర్యతో బీబీ డాన్స్ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ ఫాలోవర్స్‌ను పెంచుకుంది. అయితే ఫైమా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ప్రవీన్‌తో లవ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే.. ఫైమా కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఐదేళ్ల నుంచి రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అంతా షాకయ్యారు. అలాగే ప్రవీన్‌ను మోసం చేసిందని కూడా పలు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఫైమా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిట్‌చాట్ నిర్వహించింది. అయితే అందులో ఓ నెటిజన్.. ‘అక్కా మీ పెళ్లి ఎప్పుడు’ అని ప్రశ్నించాడు. దీనికి ఫైమా తెలివిగా పెళ్లి జరిగినప్పుడే అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫైమా తెలివిగా తప్పించుకుందని కొందరు అంటున్నారు.Next Story

Most Viewed