సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తప్పిన పెను ప్రమాదం

by Gantepaka Srikanth |
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ బీచ్‌ రోడ్‌లోని కంటైనర్ టెర్మినల్‌(Container terminal)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా ఓ కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ అలుముకున్నది. గమనించిన స్థానికులు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్‌(Superstar Rajinikanth) నటిస్తోన్న తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే మూవీ యూనిట్ అప్రమత్తమైంది. కాగా, కంటైనర్‌లో లిథియం బ్యాటరీలు ఉండటంతో పాటు ఇటీవలే చైనా నుంచి వచ్చినట్లు అధికారులు, పోలీసులు గుర్తించారు. కోల్‌కతాకు పంపేందుకు లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. కాగా, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు విశాఖ పోర్ట్ ఏరియాలో కూలీ షూటింగ్‌ను మేకర్లు ప్లాన్ చేశారు. అనూహ్యంగా ప్రమాదం జరుగడంతో స్పాట్‌ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Read More....

Thalapathy Vijay: తలపతి విజయ్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. ఆ విషయంలో సంచలన నిర్ణయం!

Next Story

Most Viewed