- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నమ్రత కారణంగా ఓ అమ్మాయి జీవితం నాశనం.. అసలు విషయాలు బయటపెట్టిన డైరెక్టర్!

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తుంది. ఇక మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ నమ్రత, మహేష్ బాబు పెళ్లి చేసుకోవడం ఓ అమ్మాయి పిచ్చిది అయింది అని అన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘‘ నేను అష్టా చమ్మా సినిమా చేసే సమయంలో మహేష్ బాబును ఓ సినిమాలో గెస్ట్ రోల్‌లో తీసుకుందామనుకున్నాను. దాని కోసం కొంత స్టోరీ రాసుకున్నాను. అప్పుడే ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఆయన తండ్రి కృష్ణ అతన్ని బయటకు రానివ్వలేదు. ఆ తర్వాత నేను మళ్లీ వెళ్లలేదు.
అయితే మహేష్-నమ్రత పెళ్లైన సమయంలోనే తిరుపతిలో సూపర్ స్టార్ ఫ్యాన్ ఓ అమ్మాయి పిచ్చి పట్టి మానసిక పరిస్థితి క్షీణించింది. నమ్రతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి తట్టుకోలేక పోయింది. దీంతో వీధుల్లో తిరిగి రచ్చ రచ్చ చేసింది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం డైరెక్టర్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు అంటే నమ్రత, మహేష్ బాబు పెళ్లి చేసుకోవడం వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం అయిందన్నమాట అంటూ తెగ చర్చించుకుంటున్నారు.