రామ్ చరణ్‌కు బియ్యం ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచిన అభిమాని..

by Disha Web |
రామ్ చరణ్‌కు బియ్యం ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచిన అభిమాని..
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా హీరోలంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి అభిమానం ఉంటుంది. వారి అభిమానాన్ని చాటుకునేందుకు కొంత మంది పచ్చబొట్లు వేయించుకోవడం, అన్నదానం, రక్తదానాలు లాంటివి చేస్తుంటారు. కానీ రామ్ చరణ్‌కు వీరాభిమాని అయినా ఓ యువకుడు మాత్రం తన హీరో కోసం ఏకంగా 264 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. గద్వాల్‌కు చెందిన జైరాజ్ అనే యువకుడు తన అరెకరం పొలంలో రామ్ చరణ్ ముఖచిత్రం ఆకారంలో వరి పంటను సాగు చేశాడు. అందులో పండిన బియ్యాన్ని రామ్‌కు కానుకగా అందించేందుకు గద్వాల్ నుంచి హైదరాబాద్ వరకు సుమారు 264 కిలో మీటర్లు నడుచుకుంటూ తన అభిమాన హీరో నివాసానికి చేరుకున్నాడు. రామ్ చరణ్‌ను కలిసి ఆయన ముఖ చిత్రం ఆకారంలో పండించిన చేను చిత్రపటాన్ని, క్వింటా బియ్యాన్ని కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Next Story