చంపుతానని పక్కింటి మహిళను బెదిరించిన నటి.. కేసు నమోదు

by GSrikanth |
చంపుతానని పక్కింటి మహిళను బెదిరించిన నటి.. కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి శరణ్య పొన్వన్నన్ వివాదంలో చిక్కుకున్నారు. తన ఫ్యామిలీతో చెన్నై సమీపంలోని విరుగంబాక్కంలో నివాసం ఉంటున్న ఆమెపై కేసు నమోదు అయింది. పార్కింగ్ విషయంలో పక్కింటి మహిళతో శరణ్య గొడవ పడింది. అదికాస్త తీవ్రరూపం దాల్చడంతో గొడవకు దారి తీసింది. ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె శరణ్య పక్కంటి మహిళను చంపేస్తానని బెదిరించారట. దీంతో పొరుగింటి శరణ్యపై ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. కాగా, శరణ్య.. ధనుష్ హీరోగా నటించిన రఘువరణ్ బీటెక్ సినిమాలో తల్లి పాత్ర పోషించి అందరి మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది.

Next Story