కుటుంబం కోసం 9 ఏళ్లకే ఆ పని చేసింది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది!

by Disha Web Desk 8 |
కుటుంబం కోసం 9 ఏళ్లకే ఆ పని చేసింది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది!
X

దిశ, సినిమా : ఇండస్ట్రీలో ఎదగాలంటే, ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కష్టాలు పడి, తన జీవితాన్ని ఒక అందమైన పూల తోటగా మలుచుకుంటారు. అంతే కాకుండా, చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరోయిన్ రేంజ్‌‌కు ఎదిగిందంటే ఆమె ఎన్నో కష్టాలు పడి ఉంటుంది.అయితే ఓ స్టార్ హీరోయిన్ పడిన కష్టాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

పంజాబీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న బ్యూటీ నీరు బజ్వా. ఈమె తన చిన్ననాడు చాలా కష్టాలు అనుభవించిందంట. తన తండ్రి వృత్తిరీత్యా, వైద్యుడు కెనడాలో లైసెన్స్ లేకపోవడంతో వైద్య వృత్తిలో కొనసాగించలేకపోయారంట. దీంతో ఫ్యామిలీలో తినడానికి కూడా తిండి దొరకకపోవడంతో నటి, పేపర్లు వేస్తూ ఉండేదంట.అలా తొమ్మిదేళ్ల వయసులో ఇంటి ఇంటికి పేపర్ వేస్తూ తన ఫ్యామిలీని పోషించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ నటి మెయిన్ సోలహ్ బరాస్‌కి ద్వారా చిత్రద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కానీ ఆమె ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత హాల్లా గల్ చిత్రం ద్వారా పంజాబీ సినిమాల్లోకి అడుగు పెట్టి మంచి సక్సెస్ అందుకుంది.

Next Story

Most Viewed