మూడు రోజుల్లో మీ ముందుకు.. యంగ్ హీరోయిన్ పోస్ట్ వైరల్

by sudharani |
మూడు రోజుల్లో మీ ముందుకు.. యంగ్ హీరోయిన్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : యంగ్ బ్మూటీ చాందిని చౌదరి ‘కలర్ ఫొటో’ మూవీతో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. దీంతో మంచి క్రేజ్ తన సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇక ఈ ఏడాది ‘గామి’ చిత్రంతో అలరించిన చాందిని.. ప్రజంట్ మరో రెండు ‘మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.

చాందిని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యేవమ్’. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషు రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే.. చాందిని నటిస్తున్న మరో చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శివ పాలడుగు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇది కూడా జూన్ 14 న విడుదల కాబోతుంది. ఈ మేరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చింది చాందిని. ‘మరో మూడు రోజుల్లో’ అంటూ ఈ చిత్రాల రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కాగా.. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed