16 ఏళ్ళ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్.. వైరల్ అవుతున్న అమీర్ ఖాన్ న్యూ పోస్టర్

by Kavitha |   ( Updated:2024-03-05 08:52:36.0  )
16 ఏళ్ళ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్.. వైరల్ అవుతున్న అమీర్ ఖాన్ న్యూ పోస్టర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోలో అమీర్ ఖాన్ కూడా ఒకరు. అందరిలా కాకుండా డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ మిస్టర్ పర్ఫెక్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక 2022లో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి అదే ఏడాది ‘సలాం వెంకీ’ లో గెస్ట్ రోల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు తర్వాత అమిర్ కొంచెం బ్రేక్ ఇచ్చి.. ఇప్పటివరకు మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆమిర్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఆమిర్ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు.

ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం 16 ఏళ్ళ కాంబినేషన్‌ని.. అమీర్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. 2007లో అమీర్ ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్’ సినిమా అంతా చూసే ఉంటారు. స్కూల్ ఎడ్యుకేషన్, పేరెంటింగ్ కాన్సెప్ట్ తో ఎనిమిదేళ్ల బాలుడు ‘దార్శీల్ సఫారీ’.. టీచర్‌గా నటించిన అమీర్ చూటు ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఇక ఇప్పుడు వీరిద్దరు 16 ఏళ్ళ తర్వాత కలిసి నటించబోతున్నారు. ఈ రీ యూనియన్ గురించి దార్శీల్ ఒక పోస్ట్ చేశారు.. ‘16 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు కలిసి నటించబోతున్నాము. ఎమోషనల్ గా ఉంది ఈ మూమెంట్. దీనికి నా మెంటర్ అయిన ఆమిర్ కృతజ్ఞతలు. మరో నాలుగు రోజుల్లో బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది. ఎదురు చూస్తూ ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ప్రజంట్ ఈ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More..

లేడీ ఫ్యాన్ కోరిక తీర్చిన మెగా హీరో వరుణ్ తేజ్ వీడియోలు వైరల్.. ఏం చేశాడంటే?

Next Story

Most Viewed