చెప్పులు లేకుండా ఆ పని చేసిన తమన్నాపై ప్రశంసల వర్షం..

by Disha Web Desk 7 |
చెప్పులు లేకుండా ఆ పని చేసిన తమన్నాపై ప్రశంసల వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ ధర్మంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. అయితే దీపాన్ని వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. కానీ, కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో ఆ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఫంక్షన్ల ప్రారంభానికి, సినిమా ఓపెనింగ్స్ సందర్భాలలో దీపాలు వెలిగించే సమయంలో చెప్పులు, షూస్ వేసుకునే వెలిగిస్తున్నారు.

తాజాగా తమన్నా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నవారంతా దీపాన్ని వెలిగించారు. అయితే అందరూ చెప్పులతో.. షూలతో వెలిగిస్తే ఆమె మాత్రం తన కాళ్లకున్న చెప్పులను దూరంగా విడిచి.. అప్పుడు దీపం వెలిగించారు. దీంతో తమన్నా దీపానికి ఇచ్చిన విలువ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్ల రూపంలో ప్రశంశలు కురిపిస్తున్నారు.

బెడ్ రూమ్‌లో ప్రతిరోజు విధ్వంసమే.. అక్కడే చనిపోవాలి: మియా


Next Story

Most Viewed