ఏ కష్టమొచ్చిందో.. తనువు చలించారు..!

by  |
ఏ కష్టమొచ్చిందో.. తనువు చలించారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హస్నాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి చెరువులో దూకి సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే తరుణంలో తల్లి నుంచి తప్పించుకున్న కూతురు అనిత ప్రాణాలను కాపాడుకుంది. కానీ, చెరువులో మునిగిన తల్లి ఎల్లమ్మతో పాటు పిల్లలు రజిత, రాజు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులు మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన వారిగా గుర్తించి బంధువులకు జరిగిన విషయం చెప్పారు. అయితే, కుటుంబ కలహాల కారణంగానే ఎల్లమ్మ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.

Next Story

Most Viewed