ప్రధాని మోదీ వంట‌ మనిషికి తీవ్ర అవ‌మానం.. నిరసనకు దిగిన యాదమ్మ

by Disha Web |
ప్రధాని మోదీ వంట‌ మనిషికి తీవ్ర అవ‌మానం.. నిరసనకు దిగిన యాదమ్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని వంట మనిషికి అవమానం జరిగింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఆమెకు పాస్ ​లేదని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆమె నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన వాహనం కూడా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన యాదమ్మ హెచ్​ ఐసీసీ ప్రాంగణం బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానికి తెలంగాణ వంట రుచులు చూపించేందుకు కరీంనగర్​కు చెందిన యాదమ్మకు ప్రత్యేక ఆహ్వనం అందించారు. కానీ పాస్​ లేదన్న కారణంతో పోలీసులు ఆమెను బయటే అడ్డుకున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed