మరింత అప్రమత్తత అవసరం: మంత్రి సత్యవతి

by  |
మరింత అప్రమత్తత అవసరం: మంత్రి సత్యవతి
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరుసగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీలు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు సూచించారు. కాళేశ్వరం గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో వరుస వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగుతుండడంతో ఆమె ములుగు జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలను దగ్గరలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లు తెలిస్తే వెంటనే రెస్క్యూ చేసే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Next Story

Most Viewed