- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిండుకుండలా రిజర్వాయర్.. ప్రజల్లో టెన్షన్ టెన్షన్…

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వరద నీరు రిజర్వాయర్‌కు చేరడంతో పూర్తిగా నిండిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి కొన్ని చోట్ల నీళ్ల లీకేజీలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మోపాడు రిజర్వాయర్‌ను ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ అపరాజితసింగ్ సందర్శించారు.
డీఎస్పీ కండే శ్రీనివాసరావు, ఇతర అధికారులు కూడా అక్కడికి వచ్చి లీకేజీలను పరిశీలించారు. లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు లీకేజీలను పూడ్చుతున్నారు. రిజర్వాయర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద్దని..ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Next Story