ఆ కోతుల ఫొటో చూస్తే.. కన్నీళ్లొస్తాయి.!

by  |
ఆ కోతుల ఫొటో చూస్తే.. కన్నీళ్లొస్తాయి.!
X

దిశ, వెబ్‌డెస్క్: జంతువుల్లోనూ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. అవి కూడా భావోద్వేగానికి లోనవుతాయి. తమ ఆప్తులను కోల్పోతే కన్నీటి పర్యంతమవుతాయి. తమ సమూహంలోని తోటి జీవికి కష్టమొస్తే తోడుగా నిలుస్తాయి. తమ మీదకు శత్రువు దాడికి వస్తే, కలిసికట్టుగా నిలబడి ఐకమత్యాన్ని చాటుతాయి. మానవ సంబంధాలు అడుగంటుతున్న ఈ కాలంలో జంతువుల్లో అంతకంతకు ప్రేమ, ఔదార్యం రెట్టింపవుతున్నాయి. ఓ కోతి, తన తోటి కోతి ఆకస్మాత్తుగా పడిపోతే, ‘సీపీఆర్’ (కార్డియో పల్మనరీ రేసుసిటేషన్) అందించి కాపాడే ప్రయత్నం చేసింది. ఆ ఫొటో చూస్తే నిజంగా కన్నీళ్లు రాకమానవు.

గుప్పెడంతా గుండె..పిండంగా ఆవిర్భవించిన 21వ రోజు నుంచి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ప్రాణం పోయేంత వరకు అవిశ్రాంతంగా కొట్టుకుంటూనే ఉంటుంది. మానవ గుండె ఒత్తిడి కారణంగానో, రక్త ప్రసరణ లోపం వల్లో హాఠాత్తుగా కొట్టుకోవడం స్తంభించిపోతోంది. అలా గుండె స్పందనలు ఆగిపోయిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతుండటం మనం చూసే ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆ వ్యక్తికి ప్రథమ చికిత్సగా నోటి ద్వారా శ్వాసను (కార్డియో పల్మనరీ రేసుసిటేషన్) అందించాలని వైద్యులు సూచిస్తుంటారు. సీపీఆర్ అందించడం వల్ల గుండెపై బాహ్య ఒత్తిడి తగ్గిపోయి, ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకుంటుంది. ఇలాంటి కేసులు మనం చూశాం. ఓ కోతి, తన సహచర కోతికి ‘సీపీఆర్’ అందించి ప్రాణాలు నిలబెట్టాలనుకోవడం నిజంగా అద్భుతం. తన సహచరి కోతి కోసం, మరో కోతి ఎంతో ఆరాటపడింది. ఎలాగైనా, ఆ కోతిని బతికించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. ఆ కోతి ప్రేమను, సహచర కోతిని బతికించుకోవాలన్న తపనను ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అద్భుతంగా షూట్ చేశాడు. ఆ ఫొటో సృష్టి రహాస్యాన్ని, జీవకోటి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఈ అత్యద్భుతమైన ఫొటోను బోత్సవానలోని గాబోరోన్ గేమ్ రిజర్వ్‌లో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ విలియం స్టీల్ క్యాప్చర్ చేశాడు.

‘‘ఓ కోతి ఉన్నట్లుండి కూప్పకూలిపోయింది. దాని కాళ్లు, చేతులు చచ్చుబడిపోయినట్లు అలా పడిపోయి ఉంది. అక్కడం ఏం జరుగుతోంది నాకు తెలియదు. అక్కడికి మరో కోతి వచ్చింది. పడిపోయిన కోతిని తన చేతుల్లోకి తీసుకుని, నోటిలోకి కృత్రిమ శ్వాస అందించింది. ఒక్కసారి దాన్ని ప్రేమగా నిమిరి చూసింది. కానీ, లాభం లేకపోయింది. ఆ కోతి చనిపోయిందని తెలిసి, ఆ సహచర కోతి భావోద్వేగానికి గురైంది’ అని విలియం స్టీల్ వివరించాడు.



Next Story

Most Viewed