ఫోన్‌ పే, గూగుల్‌ పే చేయండి.. ఈ పాపను కాపాడండి

by  |
ఫోన్‌ పే, గూగుల్‌ పే చేయండి.. ఈ పాపను కాపాడండి
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణానికి చెందిన లావణ్య భూపాల్ దంపతులకు గత నెల 8 న ఇద్దరు అమ్మాయిలు(కవలలు) జన్మించారు. 9 నెలలకు బదులుగా 7 నెలలకే చిన్నారులు జన్మించడంతో పూర్తిస్థాయిలో అవయవాలు కుదురుకోలేదు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారడంతో పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని సురక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం పెద్దమ్మాయి చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందింది. ప్రస్తుతం చిన్నమ్మాయికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కనీసం చిన్న పాపను అయినా బ్రతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు తపన పడుతున్నారు. తమ కూతురు చికిత్స కోసం దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు 9959983829 నంబరుకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed