సవార్లు సై.. దులా.. అసేయ్ దులా..!

by  |
Savari
X

దిశ, భువనగిరి రూరల్ : తప్పెట దరువులకు దులా.. అసేయ్ దులా అంటూ అలాయి చుట్టూ యువకులు చిందులు వేస్తూ ఉత్సాహంగా గ్రామాల్లో సాగే పీర్ల పండుగ(మొహర్రం) యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం భక్తి, శ్రద్ధలతో కొనసాగింది. భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, రాజపేట, బీబీనగర్ మండలాల్లోని ప్రజలు కుల, మతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభమైన మొహర్రం పండగను తెలంగాణ సాంప్రదాయలకు ప్రతికగా హిందు, ముస్లింలు గ్రామాల్లో చేసుకున్నారు. పీర్ల కొట్టం ఎదురుగా అల్వాను తొవ్వి ప్రతి రోజు రాత్రి సమయంలో మంటలు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో అందరు కలిసి అసేయ్ దులా అని ఆట,పాటలతో మొహర్రం నిర్వహించుకున్నారు. బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు తిరిగి స్వగ్రామాలకు చేరుకొని వారి కోరికలు తీర్చమని పీర్లకు దట్టిలతో, మటికిల రూపంలో ఊదు, బెల్లంతో తమ మొక్కులను అప్పజెప్పారు. శుక్రవారం ఉదయం సవారీలు గ్రామాలలో సందడి చేయగా ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహించారు.

peerlu

Next Story

Most Viewed