సంజూతో మళయాల సూపర్‌స్టార్‌ సెలబ్రేషన్స్

by  |
సంజూతో మళయాల సూపర్‌స్టార్‌ సెలబ్రేషన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో దీపావళి వేడుకలు ఈ సారి కాస్త భిన్నంగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇంట్లోనే దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌, ఆయన భార్య మాన్యతా దత్‌ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా పాల్గొనడం విశేషం. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను మోహన్‌లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అభిమానులతో పంచుకోగా, అవి కాస్త వైరల్ అయ్యాయి. ‘సంజయ్‌, మాన్యతా నా స్నేహితులు’ అంటూ ఆ ఫొటోలకు కాప్షన్‌ జతచేశారు మోహన్‌లాల్‌.

ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే, వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్న ఈ మళయాల మెగాస్టార్.. ప్రస్తుతం దృశ్యం-2 మూవీలో నటిస్తున్నారు. ఇక సంజూ ఇటీవలే కేన్సర్ బారిన పడి, దాన్ని జయించి మళ్లీ తన జీవితాన్ని లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సంజూ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆయన యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీయఫ్ 2’ లో అధీరా అనే ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో సంజయ్‌దత్ క‌నిపించ‌నుండగా, ఆయన ఫస్ట్ లుక్ అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Next Story

Most Viewed