కోహ్లీని ఆకాశానికెత్తిన పాక్ మాజీ క్రికెటర్ !

by  |
కోహ్లీని ఆకాశానికెత్తిన పాక్ మాజీ క్రికెటర్ !
X

ఇస్లామాబాద్: టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్‌కి, అతని టాలెంట్‌కి ఫిదా అవని వారుండరు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు కోహ్లీ . బౌలింగ్‌ పిచ్‌ల పైనా ఆధిపత్యం చెలాయిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. దీంతో క్రికెటర్లలోనూ కోహ్లీకి అభిమానులు తయారయ్యారు. కాగా, ప్రపంచంలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్‌ను ప్రశ్నించగా ఠక్కున కోహ్లీ అనే చెప్పాడు. ‘క్రికెట్‌లో తరానికి ఒక్కరే గొప్ప క్రికెటర్ పుడతారు. వాళ్లే దిగ్గజాలని అనిపించుకుంటారు. మా తరంలో సచిన్ టెండూల్కర్ దిగ్గజ క్రికెటర్ కాగా.. సచిన్ తర్వాతే లారా, పాంటింగ్, కలిస్, సంగక్కర ఉంటారని యూసుఫ్ చెప్పాడు. అయితే ప్రస్తుత తరంలో మాత్రం ఆ ఒక్కడు విరాట్ కోహ్లీ అని కితాబిచ్చాడు.

‘అతనో నెంబర్ వన్ ఆటగాడు మాత్రమే కాదు.. గొప్ప క్రీడాకారుడంటూ’ ఆకాశానికెత్తేశాడు. కోహ్లీకి పాకిస్తాన్ జట్టులో కూడా ఎంతో మంది అభిమానులున్నారని చెప్పాడు. వన్డే, టెస్టు, టీ20ల్లో దేనిలోనూ కోహ్లీ సగటు 50కి తగ్గలేదంటేనే అతని బ్యాటింగ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చని అన్నాడు.

Tags: Cricket, BCCI, Virat Kohli, Mohammad Yousuf, Pakistan Cricket



Next Story