2021లో పంపిణీ, విస్తరణలపై దృష్టి సారిస్తాం : బ్రిటానియా!

by  |
2021లో పంపిణీ, విస్తరణలపై దృష్టి సారిస్తాం : బ్రిటానియా!
X

దిశ, వెబ్‌డెస్క్ : అర్బన్ మార్కెట్లలో అవసరమైన స్థాయిలో వృద్ధి వేగవంతం కాలేదని, ముఖ్యంగా విమానాశ్రయాలు, కంపెనీలు, రైళ్ల ట్రావెల్ వంటి ప్రదేశాల్లో వినియోగం కరోనా ప్రభావం నుంచి బయటపడలేదు. ఈ పరిణామాలతో భారత్‌లో బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు ప్రతికూలత కొనసాగుతోందని బ్రిటానియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ చెప్పారు.

‘గ్రామీణ ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి సాధిస్తోంది. అయితే, నగర ప్రాంతాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని’ ఆయన తెలిపారు. 2021లో పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీ, మార్కెట్ల విస్తరణ, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పట్టణ మార్కెట్ల కంటే గ్రామీణం, టైర్2, టైర్3 మార్కెట్లలో లాక్‌డౌన్ అంతరాయాలు ఉండటంతో కొత్త వినియోగదారులు పెరిగారని వరుణ్ వెల్లడించారు. ఈ ఏడాది పెరిగిన ఈ-కామర్స్‌తో సంస్థ సామ్ర్థ్యం, బలమైన భాగస్వామ్యం, కొత్త ఉత్పత్తులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.

Next Story