కరోనా రోగులకు మొబైల్ ఆక్సిజన్ సెంటర్లు…!

by  |
Mobile Oxygen Center
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆక్సిజన్ కొరతతో తల్లడిల్లుతున్న రోగులను కాపాడేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు కరోనా రోగులకు ఆక్సిజన్‌ను అందించేందుకు మొబైల్ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఆక్సిన్ కొరత ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోకుండా తగిన చర్యలు చేపట్టనున్నారు.

కరోనా వ్యాధి తీవ్రత పెరిగిన పేషెంట్లకు ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోతున్నాయి. చాలా వరకు హోంఐసోలేషన్‌లో చికిత్సలు పొందుతున్న వారు పరిస్థితి విషమించిన తరువాత ఆక్సిజన్ కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఫుల్ అవడంతో ఎదురుచూడక తప్పడం లేదు. తీవ్ర అస్వస్థతకు గురైన పేషెంట్లకు సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. కరోనాతో చనిపోతున్న రోగుల్లో చాలా మంది రోగులు ఆక్సిజన్ అందకనే చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పేషెంట్లను కాపాడేందుకు ప్రభుత్వం నూతన ఏర్పాట్లపై ఆలోచనలు చేస్తుంది.

మొబైల్ ఆక్సిజన్ సెంటర్లపై చర్చలు

ఆక్సిజన్ బెడ్లు దొరకక అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల కోసం ప్రభుత్వం మొబైల్ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తుంది. ఇందుకోసం ఎలాంటి ఏర్పాట్లను చేపట్టాలని ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఎక్కడికైనా తరలించి కరోనా రోగులకు సేవలందించాలని ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ని సెంటర్లను, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశాలపై, మొబైల్ ఆక్సిజన్ సెంటర్ల నిర్వహణపై సాధ్యసాధ్యాలను, అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా అధికారులను ప్రభుత్వం ఆదేశించనుంది. రాష్ట్రానికి 10 ట్యాంకర్ల ద్వారా అందుబాటులోకి వచ్చిన 200 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులోకి వచ్చింది. వీటిని అవసరమున్న ప్రతి రోగికి అందిచేందించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోవద్దని కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Next Story

Most Viewed