ప్రజలపై భారం పడొద్దు.. పరిష్కారం చూపించండి: ఎమ్మెల్సీ కవిత

by  |
ప్రజలపై భారం పడొద్దు.. పరిష్కారం చూపించండి: ఎమ్మెల్సీ కవిత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దిగువ, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా చూడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కోరారు. హౌసింగ్ బోర్డ్ అంశాన్ని సోమవారం శాసనమండలిలో లేవనెత్తిన ఎమ్మెల్సీ కవిత, పేద ప్రజలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హౌసింగ్ బోర్డు కోసం ఇప్పటి వరకు ప్రైవేటు స్థలాన్ని సేకరించి అనంతరం ఆర్థికంగా దిగువ, మధ్య తరగతి ప్రజలకు ఇవ్వాలని తెలిపారు. అయితే ప్రభుత్వానికి భూమి ఇచ్చిన యజమానులు తరుచుగా కోర్టులకు వెళ్లడం, ధరల పెరుగుదలతో రూ.18 కోట్ల అదనపు భారం పడుతుందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఈ సమస్యను అనేక సార్లు హౌసింగ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. ఆర్థిక భారాన్ని మాఫీ చేసేలా ఏదైనా పరిష్కారం చూపాలని మంత్రిని కోరారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed