ఆయుధపూజ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

by  |
MLC Kavitha
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విజయదశమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయుధ పూజ నిర్వహించారు. శుక్రవారం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, తన భర్త అనిల్‌తో కలిసి నిజామాబాద్‌లోని అత్తగారింట్లో వాహనపూజ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. తరువాత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.


Next Story