రైతుల కళ్లల్లో ఆనందం చూస్తాం : ఎమ్మెల్సీ కవిత

by  |
MLC-KAVITHA
X

దిశ, నిజామాబాద్ రూరల్: రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ-21 పంప్ హౌస్ పనులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల వరకు సాగు నీరందించే ప్యాకేజీ-21 పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. రైతులు తమ భూములు పోకుండా దాదాపు మీటరున్నరలోతు నుండి భూగర్భం నుంచి పైపులైన్లు వెళుతున్నాయని అన్నారు. రైతులందరూ పైపులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో నుండి వెళ్లడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రూరల్ మండలంలోని చివరిగంట వరకు నీరందించే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపైన ఉందని తెలిపారు. ప్రతి ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు అందించడం జరుగుతుందని వెల్లడించారు. రానున్న 5,6 నెలల్లో ప్యాకేజీ-21 పూర్తి చేసి, రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని అభిప్రాయపడ్డారు.

థర్త్‌వేవ్‌ ఎదుర్కొవడానికి సిద్ధం

రాష్ట్రంలో జిల్లాలో కరోనా అత్యంత క్లిష్టతరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా థర్డ్‌వేవ్‌ను కూడా ఎదుర్కొవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. థర్డ్‌వేవ్‌ పిల్లల్లో ఎక్కువశాతం కనబడుతోందని వైద్యులు సూచిస్తున్నారని, దీంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్యాకేజీ-21 ఒక మహాద్భుతం

కాళేశ్వరం ప్యాకేజీ-21 ద్వారా రూరల్ నియోజకవర్గానికి సాగునీరు అందించే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. కాళేశ్వరం ప్యాకేజ్-21 ద్వారా రూరల్ నియోజకవర్గ రైతులకు సాగు నీరు అందించడం ఒక మహా అద్భుతమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, మోపాల్, డిచ్‌పల్లి మండలాలకు దాదాపు రెండు లక్షల ఎకరాలకు ప్యాకేజీ 21 ద్వారానీరు అందించే కార్యక్రమం మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ సహృదయంతో ప్యాకేజీ 21కు రూ. 24,00 కోట్లు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.

Next Story

Most Viewed