చర్చలకు యాజమాన్యం రాకపోవడం ఏంటీ?

by  |
చర్చలకు యాజమాన్యం రాకపోవడం ఏంటీ?
X

దిశ, కరీంనగర్: ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో జరిగిన పేలుడు ప్రమాదంపై కార్మిక సంఘాలు చర్చల కోసం ఎదురు చూస్తుంటే..యాజమాన్యం ముందుకు రాకపోవడం విచిత్రంగా ఉందని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతోందని ఆరోపించారు. బ్లాస్టింగ్ జరిగే సమయంలోఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే నలుగురి చనిపోగా, ముగ్గురు గాయపడ్డారన్నారు. కాంట్రాక్టు కార్మికులనే నెపంతో వారి హక్కులను సింగరేణి యాజమాన్యం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. సింగరేణి ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినందున బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేవారు. పక్క రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు అక్కడి ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారం చెల్లించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.కోటి ఇవ్వడంతో పాటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సింగరేణిదే పూర్తి బాధ్యత : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఓసీపీలో జరిగిన ఘటనలో బాధ్యుల పై చర్యలు తీసుకోవడంలో సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. దీనిపై సీఎండి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. చర్చిందేందుకు కార్మిక సంఘాలు పిలుస్తున్నా సింగరేణి అధికారులు రాకపోవడం బాధాకరమని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed