సెక్రటేరియట్‌పై సుప్రీంలో పిటిషన్

by  |
సెక్రటేరియట్‌పై సుప్రీంలో పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం కోసం పాత సచివాలయాన్ని కూల్చివేతను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రజలను పట్టించుకోకుండా.. కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సచివాలయం కూల్చివేత వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. కాగా, దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమ వాదనను వినకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరింది.

Next Story