ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన నిర్ణయం.. ఆ నాయకులకు హెచ్చరిక

by  |
ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన నిర్ణయం.. ఆ నాయకులకు హెచ్చరిక
X

దిశ, అశ్వాపురం: టీఆర్ఎస్ పార్టీ పదవుల్లో ఉండి పనిచేయని మండల నాయకులపై పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు వేటు తప్పదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇందులో భాగంగానే అశ్వాపురం మండల టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు వలబోజు మురళిని తొలగించానని, ఎటువంటి యువజన విభాగం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించని కారణంగా పదవి నుండి తొలగిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు.

అంతేగాక ఇంకా కొన్ని పదవుల్లో మార్పులు ఉంటాయని, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పదవులు పొంది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోని నాయకుల ఏరివేతకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసినట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.Next Story